Site icon HashtagU Telugu

Chandrababu: వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ నేరాంధ్రప్రదేశ్ గా మారిపోయింది!

CBN Trend

CBN

వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ నేరాంధ్రప్రదేశ్ గా మారిపోయిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆయన సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ‘‘వ్యవస్థలు చేస్తున్న హత్యలకు బడుగులు బలవుతున్నారు. దొంగతనం నేరం మోపి పోలీసులు వేధించడంతో నంద్యాలలో చిన్నబాబు అనే దళిత యువకుడు ప్రాణాలు తీసుకోవడం అత్యంత బాధాకరం.

ఏ పోలీసులు అయితే వేధిస్తున్నారని 2020 నవంబర్ లో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందో…అదే పోలీస్ స్టేషన్ అధికారుల వేధింపుల కారణంగా, నేడు చిన్న బాబు రైలు కింద పడి ప్రాణాలు తీసుకోవడం విషాదకరం. రక్షణ ఇవ్వాల్సిన పోలీసుల వల్లనే ప్రాణాలు పోయే పరిస్థితుల్లోకి రాష్ట్రాన్ని తీసుకువెళ్లారు. నంద్యాల ఘటనలో బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి….బాధ్యులపై పోలీసులు కేసు నమోదు చేయాలి’’ ఆయన సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు.