AP Assembly Session 2022: మార్చి 25 వ‌ర‌కు ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు..!

  • Written By:
  • Updated On - March 7, 2022 / 02:27 PM IST

ఏపీలో ఈరోజు నుంచి అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభ‌మైన సంగ‌తి లెలిసిందే. ఈ క్ర‌మంలో తొలిరోజే ప్ర‌తిప‌క్ష టీడీపీ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయ‌డం హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఆ తర్వాత జ‌రిగిన బిజినెస్ అడ్వ‌యిజ‌రీ స‌మావేశంలో భాగంగా, మార్చి 25 వ‌ర‌కు అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. దీంతో ఈసారి మొత్తం 13రోజులు ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగ‌నున్నాయి.

స్పీకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి జగన్ మోహ‌న్ రెడ్డి, మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కన్నబాబుతో పాటు టీడీపీ నేత అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. 13 రోజుల పాటు జరగనున్న ఈ అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం 20 కీలక బిల్లులను ప్రవేశపెట్టే అవకాశముంద‌ని స‌మాచారం. ఇక సభలో గవర్నర్‌ ప్రసంగం మొదలు పెట్టగానే టీడీపీ నేత‌లు గో బ్యాక్ గ‌వ‌ర్నర్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ క్ర‌మంలో స‌భ‌లోకి మార్ష‌ల్స్ వ‌చ్చేలోపు టీడీపీ స‌భ్యులు వాకౌట్ చేసి అసెంబ్లీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు.