ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. – టెంపో వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. తిరుపతిలోని చంద్రగిరికి చెందిన 12 మంది నాయుడుపేట సమీపంలోని కనువూరమ్మ ఆలయాన్ని దర్శించుకుని టెంపోలో తిరిగి తిరుపతి బయలుదేరారు. అయితే టెంపో వాహనం శ్రీకాళహస్తి అర్ధనారీశ్వరస్వామి ఆలయం సమీపంలో రాగానే ఎదురుగా వచ్చిన లారీతో ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరోకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ప్రమాదంలో గాయపడినవారిని స్థానికులు శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు.
Road Accident : శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Road Accident Imresizer