Site icon HashtagU Telugu

Andhra: స‌ర్పంచ్ వేధింపులతో వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య.. ఆరుగురు అరెస్ట్‌

Suicide

Suicide

ఏపీలోని అన‌కాప‌ల్లి జిల్లాలో స‌ర్పంచ్ వేధింపులు తాళ్ల‌లేక ఓ వ్య‌క్తి ఆత్మ‌హ‌త్యా చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న అనకాపల్లి జిల్లా కసింకోట పోలీస్ స్టేషన్ పరిధిలో జ‌రిగింది. మృతుడు శ్రీనివాస్ సూసైడ్ చేసుకునే ముందు సెల్ఫీ వీడియో చేశాడు. వీడియో ఆధారంగా కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు ముర‌కు సర్పంచ్ కె.శ్యామ్ సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. శ్రీనివాస్ మృతికి అధికార పార్టీకి చెందిన సర్పంచ్ కె.శ్యామ్ కారణమని ఆయన కుటుంబం ఆరోపిస్తోంది. శ్రీనివాస్‌ను గ్రామ సర్పంచ్ కె .శ్యామ్, అతని అనుచ‌రులు కొట్టి అవమానించారని ఆయ‌న‌ కుటుంబ సభ్యులు ఆరోపించారు. మరోవైపు మహిళా ఉద్యోగినిపై వేధింపులకు పాల్పడిన సర్పంచ్ శ్యామ్‌తో పాటు అతని సహచరులపై కూడా పోలీసులు కేసు నమోదు చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. ఆ మహిళ తన స్నేహితుడు శ్రీనివసరావుకు గ్రామ సర్పంచ్‌పై ఫిర్యాదు చేసిందని లోకేష్ తెలిపారు. వేధింపులపై శ్రీనివాసరావు ప్రశ్నించగా, సర్పంచ్‌తో పాటు మరికొందరు ఆయ‌న్ని టార్గెట్‌ చేశారని లోకేష్‌ ఆరోపించారు. సర్పంచ్‌తో పాటు అతని అనుచరులతో కుమ్మక్కై కేసును అణిచివేసేందుకు ప్రయత్నించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.