Site icon HashtagU Telugu

Andhra Family Treats: 365 రకాల వంటలు.. అల్లుళ్లకు ‘సంక్రాంతి’ విందు!

Andhra Family

Andhra Family

సంక్రాంతి అంటే పాడిపంటలు, పిండి వంటలు, కోళ్ల పందెలు మాత్రమే కాదు.. అల్లుళ్ల సందడి కూడా. సంక్రాంతి పండుగకు కచ్చితంగా అల్లుళ్లను పిలిచి ఎన్నో మర్యాదలు చేస్తుంటారు. ముఖ్యంగా వాళ్లకు కావాల్సిన ఇష్టమైన వంటకాలను దగ్గరుండి వడ్డిస్తారు. ఈ సంక్రాంతికి కూడా అల్లుళ్లకు ప్రాధాన్యం ఇచ్చాయి ఓ రెండు కుటుంబాలు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో అల్లుళ్లకు రెండు కుటుంబాల విందును ఆఫర్ చేశాయి. కాబోయే జంట కుందవి, సాయికృష్ణకు 365 రకాల వంటలు వడ్డించి తినిపిస్తున్న బంధువులు. కొత్త అల్లుడు వినయ్‌కుమార్‌కు 365 రకాల వంటలను వడ్డిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

వంటకాల జాబితా ఇదే..

డైనింగ్ టేబుల్ మొత్తం ఏమాత్రం ఖాళీ లేకుండా అన్ని వంట‌కాల‌తో నిండిపోయింది. వీటిలో.. అన్నం, పులిహార, బిర్యానీలు, దద్దోజనం వంటి వంటకాలతో పాటు, 30 రకాల కూరలు, వివిధ రకాల పిండివంటలు, 100 రకాల స్వీట్స్, 19 రకాల హాట్ పదార్థాలు, 15 రకాల ఐస్ క్రీంలు, 35 రకాల డ్రింక్‌లు, 35 రకాల బిస్కెట్లు, 15 రకాల కేకుల‌తో విందు ఏర్పాటు చేశారు.

మర్యాదలకు మారుపేరు

తెలంగాణతో పోల్చితే ఆంధ్రలో అల్లుళ్లకు ఎక్కువగా మర్యాదలు చేస్తుంటారు. ఇక సంక్రాంతి పండుగ సమీపిస్తుండగానే ముందుగానే ఎలా చేయాలి? ఏవిధంగా చేయాలని ప్లాన్ చేసుకుంటుంటారు. ఇతర జిల్లాల్లో కంటే గోదావరి జిల్లాల్లో మర్యాదలు మరీ ఎక్కువ చేస్తుంటారు. అత్తకు కోడలు, భర్తకు భార్య.. వెరైటీలు అందించి సర్ ప్రైజ్ ఇస్తుంటారు. అల్లుళ్లకు కొత్త రకమైన వంటలను దగ్గరుంచి తినించి మురిసిపోతుంటారు. అత్తింటి వారు చేసి వంటలతో అల్లుడి పొట్ట నిండిపోయింది. ఎంత అయినా గోదారళ్ల ప్రేమ వేరండీ బాబూ..