Site icon HashtagU Telugu

AP BJP: ప్రత్యేక హోదాపై వైసీపీ రాజకీయం చేస్తోంది!

Somu Veerraju New

Somu Veerraju New

రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోంది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. రేపు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఎల్లప్పుడూ సహకరిస్తోంది. గత టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు కేంద్రం నుంచి ప్యాకేజీ కింద వేల కోట్ల రూపాయలు తెచ్చుకోగా… అదే పంథాలో జగన్ మోహన్ రెడ్డి నిధులు తీసుకొచ్చారన్నారు. కేంద్రం వివిధ పథకాల కింద ఇచ్చిన కోట్ల రూపాయల నిధులు ఏమయయ్యాయని సోము వీర్రాజు ప్రశ్నించారు. వీటన్నిటిపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిలతో బహిరంగ చర్చకు బీజేపీ సిద్ధమన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విమర్శలు చేసే స్థాయి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు లేదన్నారు.