Site icon HashtagU Telugu

Ancient Forest: దట్టమైన అడవి@ సింక్ హోల్ .. ఎక్కడో తెలుసా ?

ancient forest

ancient forest

సింక్ హోల్.. అంటే నీళ్లు ఇంకే గుంత !! అది కూడా అలాంటి సింక్ హొలే అని అనుకున్నారు. కానీ తవ్వి చూడగా .. బయటపడిన సీన్ ను చూసి ఆశ్చర్యపోయారు. 630 అడుగుల లోతు..1,004 అడుగుల ఎత్తు..492 అడుగుల వెడల్పు ఉన్న ఈ భారీ సింక్ హోల్ లో ఏం బయటపడిందో చెప్పుకోండి చూద్దాం ?

నిధులు, నిక్షేపాలు కాదు!! దట్టమైన అడవి ఆ సింక్ హోల్ లో దాగి ఉన్నదనే విషయాన్ని గుర్తించారు. 131 అడుగుల ఎత్తున్న చెట్లు కూడా అందులో పెరిగాయి. ఈ ఫారెస్ట్ సింక్ హోల్ చైనాలోని గ్వాంగ్జీ జువాంగ్ అటానమస్ ప్రాంతంలో ఉన్న పింగ్ గ్రామ సమీపంలో బయటపడింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భూగర్భంలో జరిగే మార్పుల కారణంగా.. భూమి కుంగిపోయి అప్పుడప్పుడు ఇలాంటి అడవులు ఏర్పడతాయని నిపుణులు అంటున్నారు.

ఈ సింక్ ‌హోల్‌లో దట్టమైన పొదలు కూడా ఏర్పడ్డాయని, మనుషుల భుజానికి సరిపోయేంత ఎత్తులో అవి ఉన్నాయని తెలిపారు. అన్నట్టు.. ఈ సింక్‌హోల్ లోకి దిగడానికి చాలా గంటలు కాలినడక ప్రయాణించాల్సి వచ్చింది పరిశోధకులు చెప్పారు. ఈ సింక్ హోల్ బయటపడిన గ్వాంగ్జీ ప్రాంతం అందమైన కార్ట్స్ ప్రకృతి దృశ్యాలకు పెట్టింది పేరు. భూమి పొరల్లో ఉండే సున్నపురాయి, డోలమైట్, జిపసం లాంటి శిలలు కరిగి నేల కుంగిపోతుంది.. అలా కుంగిపోయిన భూమిలో ఇలాంటి అడవులు ఉద్భవించే అవకాశాలు ఉంటాయని పరిశోధకులు వివరించారు. ప్రపంచంలోని చాలా ఇతర ప్రాంతాలలో సింక్‌హోల్స్ ఉన్నప్పటికీ.. వాటి సైజు ఒక మీటరు లేదా రెండు మీటర్లు మాత్రమే వ్యాసం కలిగి ఉంటుందని పేరొన్నారు.

https://twitter.com/dw_environment/status/1526934382157520896