Site icon HashtagU Telugu

Anchor Mother Passed Away: స్టార్‌ యాంకర్‌ ఇంట తీవ్ర విషాదం

vishnu priya

Resizeimagesize (1280 X 720) (2)

స్టార్‌ యాంకర్‌ విష్ణుప్రియ (Anchor Vishnu Priya) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె మాతృమూర్తి కన్నుమూశారు. ఈ విషయాన్ని విష్ణుప్రియనే తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలిపింది. ఈ సందర్భంగా తన తల్లితో కలిసున్న ఫొటో షేర్ చేస్తూ .. ‘మై డియర్ అమ్మ.. ఈ రోజు వరకు నాకు తోడుగా ఉన్నందుకు నీకు ధన్యవాదాలు. రెస్ట్ ఇన్ పీస్ అమ్మా..’ అంటూ విష్ణుప్రియ ఎమోషనల్ అయ్యింది.

గురువారం ఆమె తల్లి తుదిశ్వాస విడిచినట్లు విష్ణు ప్రియానే తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది. తన తల్లితో కలిసున్న ఫొటో షేర్ చేస్తూ ఎమోషనల్ విష్ణు ప్రియ ఎమోషనల్ అయ్యింది. తన పోస్టులో మై డియర్ అమ్మ ఈ రోజు వరకు నాకు తోడుగా ఉన్నందుకు నీకు ధన్యవాదాలు. నా చివరి శ్వాస వరకు నీ పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తాను. నువ్వు నా బలం, నువ్వే నా బలహీనత. ప్రస్తుతం నువ్వు ఈ అనంత విశ్వంలో కలిసిపోయావు. నువ్వు ప్రతిచోట, నా ప్రతి శ్వాసలో ఉంటావని నాకు తెలుసు. ఈ భూమి మీద నాకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో నాకు తెలుసు. అందుకు నేను నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. రెస్ట్ ఇన్ పీస్ అమ్మా అంటూ విష్ణుప్రియ పోస్టును షేర్ చేసుకుంది.

Also Read: Jamuna: బ్రేకింగ్.. సీనియర్ నటి జమున కన్నుమూత

ఈ వార్త తెలుసుకున్న బుల్లితెర నటీనటులు, యాంకర్లు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. విష్ణుప్రియ ఫ్యామిలీ పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఆమె మాతృమూర్తి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. కాగా ఒక యూట్యూబర్‌గా కెరీర్‌ ప్రారంభించిన విష్ణుప్రియ పోవే పోరా షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో సుడిగాలి సుధీర్‌తో కలిసి యాంకరింగ్ చేసింది. పలు టీవీ షోలకు యాంకర్‌గా వ్యవహరించింది. నటిగానూ బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువైంది.

Exit mobile version