Site icon HashtagU Telugu

Anchor Anasuya: నేను ఆంటీని కాను.. ట్రోలర్స్ కు అనసూయ వార్నింగ్

Anasuya

Anasuya

యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ పై నెటిజన్స్ ట్రోలింగ్ దిగడం కొత్తేమీ కాదు. గతంలో చాలాసార్లు సోషల్ మీడయా వేదికగా ట్రోలింగ్ జరిగింది. తన మీద ఇష్టానుసారంగా థంబ్స్ పెడితే కేసలు పెడుతానని హెచ్చరించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అనసూయ నెటిజన్స్ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోల్‌లపై అనసూయ ఘాటుగా స్పందించారు. అనసూయ ఇటీవల చేసిన ట్వీట్ ట్విట్టర్‌లో చర్చకు దారితీసింది. యాంకర్‌ను విజయ్ దేవరకొండ అభిమానులు ట్రోల్ చేయడం తెలిసిందే.

ట్రోల్స్‌పై స్పందిస్తూ.. అనసూయ అన్ని ట్వీట్లకు రిప్లై ఇచ్చింది. నాకు సంబంధం లేని మీలో ఎవరికీ నేను ఖచ్చితంగా ఆంటీని కాను.. 25+ అయ్యి పిల్లలు ఉంటే ఆంటీ ఏంటండీ.. మీ సౌలభ్యం దాని హక్కు కాదు కాబట్టి.. మరి మగవాళ్లకి అదే వర్తిస్తుందా అండి అని ట్వీట్ చేసింది. ? అంటే మరి ఇండస్ట్రీలో 25+ ఉన్నావాళ్ళందటిని అలాగే పిలవచా??” నాకు ఆందోళన అర్ధమౌతుంది.. టెన్షన్ పడకండి.. నన్ను అవమానిస్తే జైలుకు పంపుతా. బుద్ధి చెప్పటానికి చాలా మార్గాలున్నయ్.. ఇక నేను నీతి గా బతికానో లేదో చెప్పేందుకు నేను లేను అని ట్వీట్ చేసింది. ప్రస్తుతం అనసూయ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.