ఆంధ్రప్రదేశ్‌లో జనసేన ఆవిర్భావ సభ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. జనసేన ఆవిర్భావ దినోత్సవం ఈసందర్భంగా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామ సమీపంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ వేదికకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టారు. ఆవిర్భావ సభ కోసం సాంగ్ రిలీజ్ చేసింది జనసేన పార్టీ. ఇక ఈ కార్యక్రమానికి ఈ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వేల సంఖ్యలో అభిమానులు తరలి వస్తున్నారు.
ఈ క్రమంలో ముందుగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాలను నాదెండ్ల మనోహర్ పర్యవేక్షించారు. వేదికపైన కళాకారులు వివిధ కళారూపాలను ప్రదర్శిస్తున్నారు. దాదాపు రెండు నుంచి మూడు గంటల పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇక జనసేనాని పవన్ కల్యాణ్ సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో వేదికపైకి వచ్చే అవకాశముందని పార్టీ నేతలు చెప్పారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది జనసైనికులు తరలి రావడంతో, అక్కడి జనసేన ప్రాంగణం కిక్కిరిసి పోయింది.