Ananya Panday: ప్రైవేట్ పార్ట్స్ పై నెటిజన్స్ ట్రోలింగ్.. అనన్య ఆన్సర్ ఇదే!

సోషల్ మీడియాలో ట్రోలింగ్ సర్వసాధారణంగా మారింది.

Published By: HashtagU Telugu Desk
Ananya

Ananya

సోషల్ మీడియాలో ట్రోలింగ్ సర్వసాధారణంగా మారింది. హీరోల మొదలుకొని హీరోయిన్ల దాకా ఏదో ఒక సందర్భంలో ట్రోలింగ్స్ బారిన పడ్డవాళ్లే. లైగర్ బ్యూటీ కూడా ట్రోలింగ్ ను ఫేస్ చేయాల్సివచ్చిందట.  పూరి డైరెక్షన్ లో నటిస్తున్న బ్యూటీ బాలీవుడ్ హీరోయిన్లలో ఒకరు. ఇటీవల తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. స్టార్స్ పిల్లలు కూడా సమస్యలను ఎదుర్కొంటారని, కానీ చాలామందికి ఆవిషయం తెలియక ఇష్టానుసారంగా మాట్లాడుతారని రియాక్ట్ అయ్యింది.

‘ది రణవీర్ షో’లో తన కెరీర్ గురించి మాట్లాడుతూ తాను సెక్సిజాన్ని ఎదుర్కొన్నాని చెప్పింది. తన బాడీ పార్ట్స్ లోని బూబ్స్ పై  పలువురు కామెంట్స్ చేశారు. నా ఫిజిక్ చాలా సన్నగా ఉండటంతో బూబ్స్ సర్జరీ చేసుకోవాలని ట్రోలింగ్స్ చేశారని అనన్య గుర్తు చేసుకుంది. నా బాడీ పార్ట్స్ గురించి మాట్లాడటంతో ఏం చేయాలో తెలియక సైలంట్ ఉండాల్సి వచ్చిందని చెప్పింది. చంకీ పాండే కూతురు అనన్య పాండేని కరణ్ జోహార్ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’తో కెరీర్ స్టార్ట్ చేసింది. ఆమె టైగర్ ష్రాఫ్ సరసన నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినీ ప్రయాణం నాకు సింపుల్‌గా ఉంటుందని నేను అనుకోలేదు అని అంటోంది.  అనన్య పాండే త్వరలో విజయ్ దేవరకొండతో కలిసి ‘లైగర్’లో కనిపించనుంది.

  Last Updated: 02 Jun 2022, 04:34 PM IST