OnlineGames: స్మార్ట్‌ఫోన్‌కు బానిస.. చివ‌రికి యువకుడి ప‌రిస్థితి ఏమైందంటే..?

  • Written By:
  • Updated On - February 4, 2022 / 11:21 AM IST

నేటి డిజిట‌ల్ యుగంలో ప్ర‌తి ఒక్క‌రి చేతిలో స్మార్ట్‌ఫోన్ కామ‌న్ అయిపోయింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ వ‌ల్ల ఎన్ని ఉప‌యోగాలు ఉన్నాయో, న‌ష్టాలు కూడా చాలానే ఉన్నాయి. ముఖ్యంగా యువ‌త ఈ స్మార్ట్‌ఫోన్‌కు భానిస‌లు అయ్యి త‌మ జీవితాలు నాశ‌నం చేసుకుంటున్నార‌ని టెక్నాల‌జీ నిపుణులు చాలా కాలంగా చెబుతున్నా చిన్న పిల్ల‌ల నుండి పెద్ద‌వాళ్ళ వ‌ర‌కు ముఖ్యంగా యువ‌త స్మార్ట్‌ఫోన్స్‌కు భానిస అవుతున్నారు.

ఇక అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళితే స్మార్ట్‌ఫోన్‌లో అదేప‌నిగా గేమ్స్ ఆడుతూ ఓ యువ‌కుడు ప్రాణాల‌మీద‌కి తెచ్చుకున్నాడు. అనంత‌పురం జిల్లా క‌నేక‌ల్లు మండ‌లంలోని బెణ‌క‌ల్లు చెందిన మహేశ్ (19) 3 నెల‌లుగా నిద్ర‌లేకుండా సెల్‌ఫోన్‌లో గేమ్స్ ఆడి మ‌తిస్థిమితం కోల్పోయాడు. దీంతో అత‌డి త‌ల్లిదండ్రులు వైద్యుల‌ను సంప్ర‌దించ‌గా, అతడి మానసిక స్థితి దెబ్బ తినడానికి స్మార్ట్‌ఫోన్ కారణమని చెప్ప‌డంతో మ‌హేష్ త‌ల్లిదండ్రులు షాక్ తిన్నారు. దీంతో నిపుణులైన దైద్యుల‌తో త‌ల్లిదండ్రులు మ‌హేష్‌కు చికిత్స చేయిస్తున్నారు.