తిరుమల శ్రీవారిని రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ రెండో కుమారుడు అనంత్ అంబానీ దర్శించుకున్నారు. గురువారం వేకువజామున కాబోయే సతీమణి రాధిక మర్చంట్‌తో కలిసి అనంత్ అంబానీ స్వామివారి అర్చన సేవలో పాల్గొన్నారు. దర్శనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌కు ఇటీవలే నిశ్చితార్థం కావడంతో మొదటిసారి ఇద్దరు కలిసి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు.
Anant Ambani and Radhika: శ్రీవారి సేవలో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ దంపతులు
అనంత్ అంబానీ రాధిక మర్చంట్‌తో కలిసి అనంత్ అంబానీ స్వామివారి అర్చన సేవలో పాల్గొన్నారు.

Ananth Ambani
Last Updated: 26 Jan 2023, 03:01 PM IST