Anand Mahindra: బిల్ గేట్స్ తో ఆనంద్ మహేంద్ర భేటీ.. కలిసి పనిచేద్దాం అంటూ?

తాజాగా మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ను మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కలిశాడు. ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ వేదికగా తాము భేటీ అయిన విషయాన్ని తెలిపాడు.

  • Written By:
  • Updated On - February 28, 2023 / 09:34 PM IST

Anand Mahindra: తాజాగా మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ను మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కలిశాడు. ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ వేదికగా తాము భేటీ అయిన విషయాన్ని తెలిపాడు. ఇక తాము ఐటీ వ్యాపారం గురించి చర్చ చేయడానికి కలవలేదని.. సామాజిక చైతన్యంపై చర్చలు చేసాము అని అన్నాడు. అంతేకాకుండా బిల్ గేట్స్ తన పుస్తకాన్ని ఆటోగ్రాఫ్ చేసి ఇస్తున్న ఫోటోలను కూడా పంచుకున్నాడు ఆనంద్.

క్యాప్షన్ లో కూడా ఆయన ఆటోగ్రాఫ్ ఇచ్చినట్టు తెలిపాడు. @BillGates ని మళ్లీ చూడడం ఆనందంగా ఉంది అంటూ.. తమ బృందాల మధ్య సంభాషణ మొత్తం ఐటీ లేదా ఏదైనా వ్యాపారం గురించి కాదు అంటూ.. కేవలం సామాజిక చైతన్యం పెంచడం కోసం మేము ఎలా కలిసి పని చేయవచ్చు అని దాని గురించి చర్చించాం అని ఆయన తెలిపాడు. ఇక భారతదేశం తనకు భవిష్యత్తుపై ఆశ కలిగిస్తుందని.. మై మెసేజ్ ఇన్ ఇండియా: టు ఫైట్ క్లైమేట్ చేంజ్, ఇంప్రూవ్ గ్లోబల్ హెల్త్ అని పేర్కొన్నాడు.

ఇక బిల్ గేట్స్ ప్రపంచవ్యాప్తంగా ఆకలి, పేదరికం, పోషకాహారలో లోపాన్ని తొలగించే లక్ష్యంతో గేట్స్ ఫౌండేషన్ ప్రారంభించాడు. ఈయన మైక్రోసాఫ్ట్ సంస్థ హెడ్ పోస్ట్ నుండి పదవి విరమణ పొందిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా సమస్యల పరిష్కారాలకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. ఇక ఈయన ఆనంద్ మహీంద్రా తో కలిసే ముందు.. ముంబైలో ఆర్.బి.ఐ కార్యాలయంలో ఆర్.బి.ఐ గవర్నర్ శక్తి కాంత దాస్ తో సమావేశమై పలు అంశాల గురించి చర్చించినట్లు తెలిసింది.