Trees: చెట్ల విలువను చాటిచెప్పే అసలైన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్

ప్రస్తుతం దేశంలో ఎండలు మండిపోతున్నాయి. 44 డిగ్రీలపైగా గరిష్ట ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాల్లో నమోదవుతున్నాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కుపైగా చేరుకున్నాయి.

  • Written By:
  • Publish Date - April 21, 2023 / 08:23 PM IST

Trees: ప్రస్తుతం దేశంలో ఎండలు మండిపోతున్నాయి. 44 డిగ్రీలపైగా గరిష్ట ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాల్లో నమోదవుతున్నాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కుపైగా చేరుకున్నాయి. ఎండలతో పాటు తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎండ ప్రతాపం నుంచి ఉపశమనం కోసం చల్లదనం అందించే శీతల పానియాలను సేవిస్తున్నారు.

అయితే ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో చెట్ల విలువను తెలియజేసే ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో థర్మామీటర్‌ను ఎండలో పట్టుకుని ఉష్ణోగ్రత చెక్ చేసినప్పుడు 42 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఇక అదే థర్మామీటర్‌ను చెట్ల నీడలో ఉంచి చెక్ చేసినప్పుడు 27 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రత తగ్గింది. దీంతో చెట్లను పెంచడం వల్ల కలిగే ఉపయోగాలను ఈ వీడియో ద్వారా చెబుతున్నారు.

చెట్లను పెంచడం వల్ల భూమిపై ఉష్ణోగ్రత తగ్గుతుందని ఈ వీడియో ద్వారా నెటిజన్లు చెబుతున్నారు. ఓ నెటిజన్ ఈ వీడియోను పోస్ట్ చేయడంతో నెట్టింట చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్‌గా మారుతున్నారు. చెట్లకు ప్రతి ఒక్కరూ పెంచాలని, దాని వల్ల మనం ఆనందంగా జీవించవచ్చని చెబుతున్నారు. చెట్లకు నరకివేయడం వల్ల వేసవి తాపం పెరిగి ఇబ్బందులకు గురి అవుతామంటూ సూచిస్తున్నారు. ఇప్పటికే చెల్ల విలువను తెలుసుకోవాలని సూచిస్తున్నారు. ప్రతిఒక్కరూ ఒక్క మొక్కను పెంచితే భూమికి ఎంతో మంచి జరుగుతుందని, ఆ దిశగా అడుగులు వేయాలని నెటిజన్లు కోరుతున్నారు.

కాగా తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వడదెబ్బ ప్రభావంతో పలువురు మృతి చెందారు. ఏపీలోని పలు జిల్లాల్లో వడగాల్పుల తీవ్ర మరింత ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.