Funeral Pyre: తన చితికి తానే నిప్పుపెట్టుకున్న వృద్ధుడు.. షాకింగ్ ఘటన!

కొన్ని వార్తలు, విషయాలు అందరికీ షాకింగ్ గా ఉంటాయి. లోకంలో ఎన్నో వింతలు జరిగే క్రమంలో.. కేరళలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

  • Written By:
  • Updated On - February 10, 2023 / 09:55 PM IST

Funeral Pyre: కొన్ని వార్తలు, విషయాలు అందరికీ షాకింగ్ గా ఉంటాయి. లోకంలో ఎన్నో వింతలు జరిగే క్రమంలో.. కేరళలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కేరళలో ఓ అగ్ని ప్రమాదం జరిగిందని భావించిన పోలీసులు.. తర్వాత అసలు నిజాన్ని తెలుసుకొని షాక్ అయ్యారు. ఇలాంటి ఘటనలు కూడా చోటుచేసుకుంటాయా అని అందరూ ఆశ్చర్యపోయే ఘటన అది.

కేరళలోని పుత్తురు జిల్లాకు చెందిన విజయకుమార్ చాలాకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. స్థానికంగా తన పూర్వీకుల నుండి వంశపారంపర్యంగా వచ్చిన ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నాడు. అయితే ఓరోజు రాత్రి ఇంట్లో నుండి మంటలు రావడంతో.. విజయకుమార్ సోదరి చూసి చుట్టుపక్కలి వారిని సాయం కోసం పిలిచింది.

కాసేటి తర్వాత స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అయితే ప్రారంభంలో పోలీసులు కూడా అగ్నిప్రమాదం సంభవించిందని అనుకున్నారు. కానీ తర్వాత మాత్రం అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు. విజయకుమార్ మరణం ప్రమాదవశాత్తు సంభవించిందని అనుకున్నా అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు.

అగ్ని ప్రమాదం సంభవించిన చోట పోలీసులకు ఓ సూసైడ్ నోట్ లభించింది. అందులో పోలీసులకు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. విజయకుమార్ తన స్నేహితుడికి రాసిన ఓ లేఖలో.. తాను ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించాడు. తన అనారోగ్యం కారణంగా ఆత్మమత్య చేసుకుంటున్నట్లు స్నేహితుడికి లేఖలో వివరించాడు.