Site icon HashtagU Telugu

Rajendranagar : రాజేంద్ర‌న‌గ‌ర్‌లో బ‌య‌ట‌ప‌డ్డ సొరంగం.. 11 అడుగుల..?

Tunnel

Tunnel

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో ఓ సొరంగం బ‌య‌ట‌ప‌డింది. అత్తాపూర్‌లోని కుతుబ్‌షాహీ కాలం నాటి ముష్క్‌మహల్‌లో గతంలో తెలియని సొరంగాన్ని కొందరు యువకులు కనుగొన్నారు. వివ‌రాల ప్రకారం, కొంతమంది యువకులు ఫోటో షూట్ కోసం 300 సంవత్సరాల పురాతన ముష్క్ మహల్‌ను సందర్శించారు. ఆ స‌మ‌యంలో ఆ మహల్ లోపల ఒక సొరంగాన్ని కనుగొన్నారు. గుప్త నిధిని కనుగొనాలనే ఉద్దేశ్యంతో వారు సొరంగం లోపలికి వెళ్లినట్లు తెలుస్తుంది. కానీ సొరంగం ప్రారంభంలో 11 అడుగుల నాగుపాము వారి ముందు కనిపించడంతో వారు భయంతో పారిపోయారు. ఇప్పుడు ఈ సొరంగం వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఆ యువ‌కులు ఈ సొరంగం వీడియోని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.