Site icon HashtagU Telugu

Snake on Bed: మంచం పై పడుకున్న 6 అడుగుల పాము.. చూసి షాక్ అయిన ఆస్ట్రేలియా మహిళ

An Australian Woman Was Shocked To See A 6 Foot Snake Lying On The Bed

An Australian Woman Was Shocked To See A 6 Foot Snake Lying On The Bed

క్వీన్స్ లాండ్ కు చెందిన మహిళ ఒకరు సోమవారం ఉదయం తన బెడ్రూం సర్దేందుకు ప్రయత్నిస్తుండగా పాము (Snake) కనిపించింది. బెడ్ పైన బ్లాంకెట్ కింద దర్జాగా పడుకున్న పామును చూసి అదిరిపడింది. వెంటనే బెడ్ రూం బయటికి వచ్చి తలుపు పెట్టేసింది. పాము బయటకు రాకుండా డోర్ కింద టవల్ ను అడ్డుపెట్టింది. ఆపై పాములు పట్టే వ్యక్తికి ఫోన్ చేసి పిలిపించింది.

రాత్రంతా నిద్రించిన బెడ్ మీద తెల్లవారినపుడు ఓ పాము (Snake) కనిపిస్తే.. అదీ దేశంలోనే అత్యంత విషపూరితమైన పాము అయితే? కాసేపు గుండె కొట్టుకోవడం ఆగిపోయినట్లు అనిపిస్తుంది కదా! ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళకు ఇలాంటి షాకింగ్ అనుభవమే ఎదురైంది.

జాచెరీస్ స్నేక్ అండ్ రెప్టైల్ రీలోకేషన్ యజమాని జాచెరీ రిచర్డ్స్ ఈ పామును పట్టుకుని అడవిలో వదిలిపెట్టారు. ఈస్టెర్న్ బ్రౌన్ స్నేక్ గా వ్యవహరించే ఈ పాము (Snake) ఆస్ట్రేలియాలోని అత్యంత విషపూరితమైన వాటిలో ఒకటని రిచర్డ్స్ చెప్పారు. ఇది కనక కాటువేస్తే గుండె, ఊపిరితిత్తులు, నరాలు స్తంభించిపోయి నిమిషాల వ్యవధిలో ప్రాణాలు పోతాయని చెప్పారు.

Also Read:  OTT Movies: ఓటీటీలోకి వచ్చేసిన ‘పఠాన్’.. ఎప్పటి నుంచి అంటే..?