Site icon HashtagU Telugu

Viral : అమీ జాక్సన్ లుక్‌పై ట్రోల్స్..వామ్మో ఇలా అయిపోదేంటి..నేనెక్కడ చూడలే

Amy Jackson

Amy Jackson

అమీ జాక్సన్ (Amy Jackson)..ఈమెను కొత్తగా సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐ (I), ఎవడు (Evadu) , రోబో 2.0 (Robo 2.0)చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలే. కేవలం సినిమాలతోనే కాదు సోషల్ మీడియా లోను అమ్మడు చాల ఫేమస్. ఎప్పటికప్పుడు హాట్ హాట్ వీడియోస్ , ఫొటోస్ తో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. కెరీర్‌ పీక్స్‌లో ఉన్నప్పుడే బిజినెస్‌మేన్‌ జార్జ్‌ను ప్రేమించిన ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
కానీ ఆ ప్రేమ పెళ్లిదాకా రాకుండానే దూరమయ్యారు. గతేడాది నుంచి ఎడ్‌ వెస్ట్‌విక్‌ అనే వ్యక్తితో ప్రేమాయణం కొనసాగిస్తోంది అమీ.

తాజాగా ఈమె (Amy Jackson) సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన ఆమె తాలూకా లేటెస్ట్ పిక్స్ అభిమానులను , నెటిజన్లను షాక్ కు గురి చేస్తున్నాయి. ఈ పిక్స్ పోస్ట్ చేసిన దగ్గరి నుండి ఈమె సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతుంది. ఎందుకంటే తన లేటెస్ట్ ఫోటోలు చూస్తే ఐరిష్ నటుడు సిలియన్ మర్ఫీ గుర్తుకు వస్తున్నారట. అమీ జాక్సన్ తన బాయ్‌ఫ్రెండ్ ఎడ్ వెస్ట్‌విక్‌తో విహారయాత్రలో తీసుకున్న కొన్ని ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. తన లుక్స్ సాధారణంగా కాకుండా చాలా భిన్నంగా కనిపిస్తున్నాయి. అవి అచ్చం ఓపెన్‌హైమర్ నటుడు సిలియన్ మర్ఫీ(Cillian Murphy)ని పోలి ఉన్నాయి. అమీ బుగ్గలు ఎత్తుగా కళ్లు లోపలి వెళ్లి అచ్చం ఓపెన్‌హైమర్ హీరోలా ఉందని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. తన ఫోటోను GIF లా మార్చి నెట్టింట్లో రచ్చ చేస్తున్నారు. మరికొంతమంది అమీ.. ఏదైనా వ్యాధితో బాధపడుతుందా? లేదంటే ఏదైనా సర్జరీ చేయించుకుందా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొంతమందైతే వామ్మో ఇలా అయిపోదేంటి..నేనెక్కడ చూడలే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read Also : Karthikeya : సినీ లవర్స్ కు షాక్ ఇచ్చిన ‘బెదురులంక 2012 ‘