Electric Bike: మార్కెట్లోకి AMO కొత్త ఎలక్ట్రిక్ బైక్…ఫీచర్స్ ఇవే…!

టూవీలర్ కొనాలనుకుంటున్నారా అయితే మీకో గుడ్ న్యూస్. అత్యాధునిక టెక్నాలజీ, ఎక్కువ ఛార్జింగ్ కెపాసిటి కలిగిన ఎలక్ట్రిక్ బైక్స్ ని మార్కెట్లోకి లాంఛ్ చేసింది ఏఎంవో సంస్థ.

  • Written By:
  • Publish Date - February 8, 2022 / 03:37 PM IST

టూవీలర్ కొనాలనుకుంటున్నారా అయితే మీకో గుడ్ న్యూస్. అత్యాధునిక టెక్నాలజీ, ఎక్కువ ఛార్జింగ్ కెపాసిటి కలిగిన ఎలక్ట్రిక్ బైక్స్ ని మార్కెట్లోకి లాంఛ్ చేసింది ఏఎంవో సంస్థ. ఈ ఎలక్ట్రిక్ బైక్స్ ఉత్తమ పనితీరుతో పాటు సేఫ్టీ డ్రైవింగ్ వీలుంటుంది. ఈ స్కూటర్ కు ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ కావడానికి దాదాపు 4 గంటల సమయం పడుతుంది. గంటకు 120కిలీమీటర్ల వేగంతో పయణిస్తుంది. ఎక్కువ దూరం, ఎక్కువ మైలేజీని ఇవ్వడమే ఈ బైక్ స్పెషాలిటీ. అంతేకాదు స్పీడ్ కంట్రోల్ చేసే విధంగా డిజైన్ చేశారు. ఏఎంవో లాంఛ్ చేసిన ఎలక్ట్రిక్ బైక్ స్టైల్, ఫెర్మార్మెన్స్ తోపాటు సేఫ్టి తక్కువ ధరకు మార్కెట్లో వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ బైక్ ధర రూ. 1,10,460. బెస్ట్ ఫీచర్స్ తో ఈ జనరేషన్ కు తగ్గట్లుగా డిజైన్ చేశారు. ఇక టైర్లు రోడ్ గ్రిప్, శక్తివంతమైనవిగా పనిచేస్తాయి. భారత్ లో అత్యంత వేగంగ దూసుకుపోతున్న ఎలక్ట్రిక్ మొబిలిటీ బ్రాండ్ అయితే ఏఎంఓ తమ ఎలక్ట్రిక్ బైక్స్ తోపాటుగా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను కూడా లాంఛ్ చేసింది.

ఆకట్టుకునే డిజైన్, స్టైల్ తోపాటు ఎలక్ట్రిక్ బైక్ పికప్ ను ఇచ్చే విధంగా డిజైన్ చేశారు. అధునాతన లిథియం బ్యాటరీతో వస్తుంది. ఎక్కువ దూరం ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. పట్టణాలు, నగరాల్లో ఉండే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ బైట్ గంటకు 120కిలోమీటర్ల వేగంతో పరుగెడుతుంది. ఇక ఫాస్ట్ ఛార్జింగ్ పూర్తి చేయడానికి నాలుగు గంటల సమయం పడుతుంది. దాని మెరుగైన భద్రత, స్టైల్ తో ప్రత్యేకించి జాంటీ ప్లస్ మొబైల్ యుస్బీ ఛార్జింగ్ పోర్టు కూడా ఉంది. ఇది స్థిరమైన పోర్టముల్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ను కలిగి ఉంటుంది. మూడు సంవత్సరాల వారంటీ ఉంటుంది. రెడ్-బ్లాక్, గ్రే-బ్లాక్, బ్లూ-బ్లాక్, వైట్-బ్లాక్ కాంబినేషన్లో వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.

ఏఎంవో ఎలక్ట్రిక్స్ బైక్స్ ను ఇండియాలో విశ్వసనీయమైన క్వాలిటీ, ప్రైస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్స్ ను రూపొందించే లక్ష్యంతో ప్రారంభించారు. 2018లో స్థాపించిన ఈ సంస్థ ఇ మొబిలిటిని మాస్ మొబిలిటీగా మార్చడం అనే దాని ద్రుష్టిని సాధించడానికి క్రుషి చేస్తుంది.

Follow us