Site icon HashtagU Telugu

Sun: అమ్మో భానుడు భగభగ… ఫిబ్రవరిలోనే ఉక్కపోత!

Sun

Sun

Sun: దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నారు. ఇంకా ఫిబ్రవరి నెల పూర్తికాక ముందే వేడి కాకరేగుతోంది. ఉదయం పది గంటలకే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నారు. గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రలోని కొంకణ్, గోవా, కర్ణాటకలో 35 నుంచి 39 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇంతకీ ఉష్ణోగ్రతల్లో ఒక్కసారిగా ఇంతటి మార్పులు ఎందుకు సంభవించాయి? ఈ ఏడాది వేసవి కాలం ముందుగా వచ్చిందా? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నా రు.

ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. ఈ ఏడాది ఎండల తీవ్రంగా అధికంగా ఉండేలా కనిపిస్తుంది. ఫిబ్రవరికే ఈ స్థాయిలో వేడి తీవ్రత ఉందంటే, మరి వచ్చే నెలలు ఏ విధంగా ఉంటాయో అంచనా వేసుకోవచ్చు. మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో వేడి గాలులు తీవ్రంగా వీచే సూచన కనిపిస్తోందని అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణశాఖ-ఐఎండీ నిపుణులు హెచ్చరించారు. ఈ ప్రకటన వచ్చిన తర్వాత రోజునే, మరో ప్రకటనలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతాయనే వార్తను వచ్చింది.

ఏటా ఈ సమయానికి నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో పోల్చి తే ప్రస్తుత ఉష్ణోగ్రతలు అధికమనే చెప్పాలి. పశ్చిమ ప్రాంతం నుంచి వీస్తున్న వేడిగాలులను వాయవ్య ప్రాంతంలోని పర్వతాలు అడ్డుకుంటాయి. దీనివల్ల తక్కువ మొత్తంలో ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. కానీ, ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవు. పర్వత ప్రాంతంలో ఈ ఏడాది వర్షపాతం తగ్గడంతోపాటు, పొడి వాతావరణం నెలకొనడం వల్ల పశ్చిమ ప్రాంతం నుంచి వీస్తున్న వేడిగాలులు నేరుగా దేశంలోకి ప్రవేశిస్తున్నా యి. ఫలితంగా ఎండలు దంచికొడుతున్నాయి.

మధ్యధరా ప్రాంతంలో ఏర్పడిన తుపానులు భారత వాయవ్య ప్రాంతం మీదుగా ప్రయాణించి అక్క డ వర్షాలు కురిపిస్తాయి. కానీ, అలాంటి పరిస్థితులు లేకపోవడం కూడా ఉష్ణోగ్రతలు పెరగడానికి ఓ కారణంగా చెప్పవచ్చు. మరోవైపు గుజరాత్లో ఏర్పడిన యాంటీ సైక్లోన్లూ ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమవుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా సముద్రం మీదుగా వచ్చే చల్లని గాలులు.. భూ వాతావరణంలోకి రాకుండా అడ్డుకున్నప్పుడు యాంటీ సైక్లోన్ పరిస్థితులు ఏర్పడతాయి. ఇది కూడా ఉష్ణోగ్రతల పెరుగుదలకు దారితీసిందని చెబుతున్నారు. అయితే మరో రెండు మూడు రోజుల్లో ఉష్ణోగ్రతల ప్రభావం తగ్గే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నా రు. కానీ, సాధారణం కంటే ఎక్కు వగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని చెబుతున్నారు.

Exit mobile version