Site icon HashtagU Telugu

Amitabh Covid: మళ్లీ కరోనా బారినపడిన అమితాబ్ బచ్చన్

Amitabh Imresizer

Amitabh Imresizer

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు మళ్లీ కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే నిన్న రాత్రి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇటీవల ఆయనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ‘బిగ్ బి’కి కరోనా సోకిందని తెలిసిన వెంటనే ఆయన అభిమానులు, సినీ తారలు స్పందించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.

అమితాబ్ ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్ పతి 14వ సీజన్ షూటింగ్‌లో ఉన్నారు. అలాగే ఆయన కీలక పాత్రలో నటించిన ‘బ్రహ్మాస్త్రం’ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్, అలియా భట్, నాగార్జున, మౌనిరాయ్ తదితరులు నటిస్తున్నారు. అలాగే ‘గుడ్‌బై’, ‘ఊంచాయ్‌’ సినిమాల్లో నటిస్తున్నారు. రష్మిక మందన్నతో మరో సినిమాలో కనిపించబోతున్నాడు. కరోనా బారిన పడిన అమితాబ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.

అమితాబ్‌కు కరోనా సోకడం ఇది రెండోసారి. రెండేళ్ల క్రితం ఆయనకు కరోనా సోకడంతో ఆస్పత్రిలో చేరి కోలుకున్నారు. అలాగే, అతని కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్య రాయ్ మరియు మనవరాలు ఆరాధ్య కూడా కోవిడ్ నుండి కోలుకున్నారు.