ఈనెల 21 న హోంమంత్రి అమిత్ షా తో భేటీ రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. అమిత్ షా కార్యాలయం నుండి బండి సంజయ్ కి ఫోన్ చేసి ఈ నెల 21న సమావేశముందని తెలిపారు. ఈ భేటీలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులతో పాటు, బండి సంజయ్ చేయనున్న ప్రజా సంగ్రామ యాత్ర, పార్టీ భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై చర్చ జరగనుంది.
వరిధాన్యం విషయంలో బీజేపీపై టీఆర్ఎస్ వరసగా నిరసన కార్యక్రమలు నిర్వహిస్తున్న సమయంలో జరగనున్న ఈ భేటీలో ఎలాంటి చర్చ జరగవచ్చనే అంశం ఆసక్తిగా మారింది. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే విషయంపైనే ఎక్కువ చర్చ ఉండొచ్చని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.పలు పార్టీల్లో ఇబ్బంది పడుతున్న బలమైన నాయకులను బీజేపీలోకి ఆహ్వానించే అంశంపై కూడా చర్చించే అవకాశముందని బీజేపీ నాయకులు చెపుతున్నారు.