Site icon HashtagU Telugu

Amit Shah : పటేల్ వల్లే తెలంగాణకు విముక్తి లభించింది..!!

Amit1

Amit1

తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో అట్టహాసంగా షురూ అయ్యాయి. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి. ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సందర్భంగా ప్రసంగించారు. సర్దార్ పటేల్ వల్లే తెలంగాణకు విముక్తి లభించిందన్నారు. లేదంటే తెలంగాణ విముక్తికి మరింత సమయం పట్టేదన్నారు. వేడుకలు నిర్వహించాలంటే…ఇప్పటికీ కొంతమంది భయ పడుతున్నారన్నారు. ఎలాంటి భయం లేకుండా వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని కోరుతున్నానని అమిత్ షా పేర్కొన్నారు.

తెలంగాణ గడ్డపై జాతీయ జెండా ఎగరవేసేందుకు ఎంతో మంది ఆత్మబలిదానాలు చేసుకోవల్సి వచ్చిందన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణలో స్వాంతంత్ర్య వేడుకలను గత సర్కార్ జరపలేదన్నారు. 75 ఏళ్ల తర్వాత బీజేపీ సర్కార్ ఈ వేడుకలను నిర్వహిస్తోందని చెప్పారు.