Site icon HashtagU Telugu

Manipur Violence: మణిపూర్ హింసాకాండ…రంగంలోకి దిగిన అమిత్ షా

Manipur Violence

New Web Story Copy 2023 05 30t200347.517

Manipur Violence: మణిపూర్‌లో మూడు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఇంఫాల్ చేరుకున్న అమిత్ షా.. ఇప్పటి వరకు పలు సమావేశాలు నిర్వహించారు. మణిపూర్‌లో శాంతి, సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్ర మంత్రి అమిత్ షా ఇంఫాల్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి నివాసంలో ఈ అఖిలపక్ష సమావేశం జరిగింది.

మే 3 నుండి మణిపూర్‌లో జరిగిన జాతి హింసలో కనీసం 75 మంది మరణించారు మరియు 300 మంది గాయపడ్డారు. అంతకుముందు అమిత్ షా సోమవారం మణిపూర్ గవర్నర్ అనుసూయా ఉయికేతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్, రాష్ట్ర మంత్రులు, సీనియర్ నేతలు, అధికారులతో కూడా షా సమావేశమయ్యారు.

మణిపూర్‌లో హింసలో మరణించిన వారికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కేంద్రం, మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాయి. అల్లర్లలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. పరిహారం మొత్తాన్ని కేంద్రం, రాష్ట్రం సమానంగా భరిస్తాయని అధికారులు తెలిపారు. అమిత్ షా, సీఎం ఎన్ బీరెన్ సింగ్ మధ్య సోమవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Read More: Sanjay Dutt: జైలుకు వెళ్లే ముందు కమిట్మెంట్ పూర్తి చేసిన సంజూ