Karnataka Polls: ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లపై అమిత్ షా హాట్ కామెంట్స్

ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. అధికార పార్టీ బిజెపి, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో దూకుడు పెంచాయి

Karnataka Polls: ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. అధికార పార్టీ బిజెపి, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో దూకుడు పెంచాయి. అధికారమే లక్ష్యంగా ఒకరినొకరు దూషించుకుంటూ ఎన్నికల వేడిని పెంచేస్తున్నారు. ముఖ్యంగా కర్ణాటక ఎన్నికలు ప్రస్తుతం హాట్ హాట్ గా మారాయి.

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వివిధ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ రాజ్యాంగ విరుద్ధమైన రీతిలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిందని, అయితే బీజేపీ ఈ పద్ధతికి స్వస్తి పలికిందని షా అన్నారు.

శనివారం ఓ కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ… బీజేపీ హయాంలో అర్హులైన వారికి రిజర్వేషన్ హక్కులు కల్పించిందని అన్నారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లను రాజ్యాంగం అనుమతించలేదని కాంగ్రెస్‌పై షా మండిపడ్డారు. సామాజిక కోణంలో న్యాయం విషయానికొస్తే గతంలో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా 4 శాతం ముస్లిం రిజర్వేషన్లు కల్పించిందని, మన రాజ్యాంగం మత ప్రాతిపదికన రిజర్వేషన్లను అనుమతించనందున ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేసిందని అమిత్ షా చెప్పుకొచ్చారు. ఎస్సీ, ఎస్టీ, లింగాయత్‌లకు ప్రభుత్వం రిజర్వేషన్లు పెంచిందని గుర్తు చేశారు. గత నెలలో కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేసిన విషయం తెలిసిందే.

Read More: Rajinikanth : త‌లైవా రూపంలో టీడీపీ, బీజేపీ పొత్తు?