Site icon HashtagU Telugu

Ukraine Russia War: ర‌ష్యా భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దు..!

Joe Biden Putin

Joe Biden Putin

ఉక్రెయిన్‌లో ర‌క్త‌పాతం సృష్టించిన రష్యా, ఆ దేశం పై రెండో రోజు కూడా బాంబ‌లు వ‌ర్షం కురిపిస్తుంది. ఈ క్ర‌మంలో ఉక్రెయిన్,ర‌ష్యాల మ‌ధ్య యుద్ధం మొద‌లైన నేప‌ధ్యంలో, ఇతర దేశాలు జోక్యం చేసుకోవద్దంటూ రష్యా అధినేత వ్లాదిమీర్ పుతిన్ గురువారం నాటో దేశాల‌తో పాటు ఇత‌ర దేశాల‌కు వార్నింగ్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా స్పందించిన అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ పుతిన్‌తో మాట్లాడే అవ‌స‌రం లేద‌ని, రష్యా పై మ‌రింత క‌ఠిన ఆంక్ష‌లు విధించ నున్నామ‌ని తెలిపారు.

ఉక్రెయిన్‌లో విధ్వంశం సృష్టిస్తున్న‌ రష్యాను అన్ని రకాలుగా దిగ్భంధనం చేస్తామ‌న్నారు బైడెన్. ఈ క్ర‌మంలో ఇప్పటికే రష్యాకు చెందిన వివిధ బ్యాంకులను సీజ్ చేశామ‌ని, ష్యాకు వ్యతిరేకంగా ప్రపంచం మొత్తం ఏకమవుతుందని చెప్పారు. పుతిన్ ఒక నియంత అని, ఒక ఆక్రమణదారుడని బైడెన్ అభివర్ణించారు. పుతిన్ రష్యాను సోవియట్ యూనియన్ గా మార్చేందుకే ఈ యుద్ధానికి దిగినట్లు అనిపిస్తుందన్నారు. అమెరికా పై రష్యా సైబర్ దాడులకు దిగినా తాము సిద్ధంగా ఉన్నామని జో బైడెన్ తెలిపారు. ర‌ష్యా పై జీ 7, ఈయూ కూటమి దేశాలు ఆంక్షలు విధించాలని జో బైడెన్ కోరారు. పుతిన్ చ‌ర్య‌ల‌త‌తో రష్యా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని జో బైడెన్ వార్నింగ్ ఇచ్చారు.

Exit mobile version