Site icon HashtagU Telugu

Visa: వీసాలకు ప్రత్యక్ష ఇంటర్వ్యూలు రద్దు – అమెరికా

Template (52) Copy

Template (52) Copy

కరోనా మహమ్మారిని నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ వీసాల విషయంలో వెసులుబాటును పొడిగించింది. వీసా దరఖాస్తుదారులకు భారత్ లోని స్థానిక కాన్సులేట్లలో ప్రత్యక్షంగా ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సిన అవసరం ఉండదని వర్చ్యువల్ గా హాజరు కావాలని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ సదుపాయం అమల్లో ఉండగా 2022 డిసెంబర్ 31 వరకు దీనిని పొడిగించినట్టు ప్రకటించింది. దీంతో ఆన్ లైన్ ఇంటర్వ్యూ విధానంతోనే వీసాను పొందొచ్చు.

తాత్కాలిక వర్క్ వీసాదారులపై ఉండే ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని నాన్ ఇమిగ్రెంట్ పర్యాటక వీసాలను అందించేందుకు కట్టుబడి ఉన్నట్టు తెలిపింది. కొన్ని రకాల నాన్ ఇమిగ్రెంట్, వ్యక్తిగత వీసాలకు ప్రత్యక్ష ఇంటర్వ్యూల నుంచి హాజరు మినహాయింపు మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది.

ప్రత్యేకమైన వృత్తిపరమైన వీసాలు (హెచ్1బీ), ట్రైనీ లేదా స్పెషల్ ఎడ్యుకేషన్ (హెచ్3 వీసాలు), అసాధారణ సామర్థ్యాలు కలిగిన వారు (ఓ వీసాలు), అథ్లెట్లు, ఆర్టిస్ట్ లు, వినోద రంగానికి చెందిన వారు (పీ వీసాలు), ఇంటర్నేషనల్ కల్చరల్ ఎక్చేంజ్ కార్యక్రమాలకు (క్యూ వీసాలు) వీసాలు తీసుకునే వారికి ఈ వెసులుబాటును కల్పిస్తున్నట్టు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.

Exit mobile version