Ameesha Patel: బాలీవుడ్ నటి అమీషా పటేల్ చీటింగ్ కేసు ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఓ వ్యక్తి వద్ద డబ్బులు తీసుకుని మ్యూజిక్ ఆల్బమ్ చేయలేదన్న విమర్శలు ఆమెపై ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇది కాకుండా బెదిరింపు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు శనివారం ఆమె రాంచీ సివిల్ కోర్టుకు హాజరయ్యారు. ఇరు వాదనలు విన్న కోర్టు అమీషా పటేల్‌కు జూన్ 21 వరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణ జూన్ 21న జరగనుంది.
అజయ్ కుమార్ సింగ్ అనే వ్యక్తి అమీషా పటేల్ పై నవంబర్ 17, 2018న కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అమీషా పటేల్, ఆమె వ్యాపార భాగస్వామి కునాల్ గుమార్‌పై ఈ పిటిషన్ దాఖలైంది. అమీషా పటేల్ మ్యూజిక్ మేకింగ్, అదేవిధంగా సినిమా మేకింగ్ పేరుతో అజయ్ కుమార్ సింగ్ నుంచి రూ.2.5 కోట్లు తీసుకున్నారని, ఆ తర్వాత ఆమె మ్యూజిక్ మేకింగ్ చేయకుండా మోసం చేసినట్టు పిటిషన్ లో పేర్కొన్నారు. ఒప్పందం ప్రకారం జూన్ 2018లో సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే వారి నుంచి సమాధానం లేకపోవడంతో అజయ్ డబ్బు డిమాండ్ చేశాడు. కాగా 2018 అక్టోబర్‌లో అజయ్ సింగ్‌కు రూ.2.5 కోట్ల 50 లక్షల రెండు చెక్కులు ఇచ్చారని, అది బౌన్స్ అయ్యిందని ఆరోపించారు. దీంతో అజయ్ సింగ్ నటిపై కేసు పెట్టాడు.
Read More: KCR Survey: కేసీఆర్ ఫస్ట్ లిస్ట్ రెడీ, సిట్టింగ్స్ లో టెన్సన్!