Hyderabad: అబ్బా సొత్తు కాదురా టాలెంటూ,, ఎవడి అబ్బా సొత్తు కాదురా టాలెంటూ. అవును టాలెంట్ అనేది ఎవరికీ సొంతం కాదు. సత్తా ఉండాలి కానీ అసాధ్యం అంటూ ఏదీ ఉండదు. తాజాగా హైదరాబాద్ యువకుడు అదే నిరూపించాడు. 104 అంబులెన్స్ డ్రైవర్ గౌస్ ఖాన్ కుమారుడు అనాస్ ఖాన్ 1745 ఆల్ ఇండియా-ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ సాధించి, ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్‌లో ప్రవేశానికి అర్హత సాధించాడు.
తండ్రి మహబూబ్‌నగర్‌లో అంబులెన్స్ డ్రైవర్‌గా నెలకు రూ. 17,000 జీతం తీసుకుంటున్నాడు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన అనాస్ ఖాన్ చదువునే జీవితంగా మల్చుకున్నాడు. ఇంటర్మీడియట్ పరీక్షలలో 94 శాతం ఉతీర్ణత సాధించాడు. అదేవిధంగా ఆల్ ఇండియా-ఈడబ్ల్యూఎస్ 1745 ర్యాంక్ సాధించాడు. మెటలర్జీలో బీటెక్ చేయబోతున్న అనస్ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అడుగుజాడలను అనుసరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. పిచాయ్ కూడా IIT ఖరగ్‌పూర్ నుండి మెటలర్జీ ఇంజనీర్‌గా పట్టభద్రుడయ్యాడు.
Read More: Election preparation : తెలంగాణలో ECI అధికారులు! కలెక్టర్లు, ఎస్పీతో భేటీ