ఇప్పటికే ప్రచార హోరులో దూసుకుపోతున్న బీఆర్ఎస్ పార్టీ చేరికలపై గురి పెడుతోంది. వివిధ ప్రాంతాల ముఖ్య నేతలు, బలమైన నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. తాజాగా రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు సమక్షంలో చిన్నబోయిన శంకర్ ముదిరాజ్ (అంబర్ పేట శంకర్) రాఘవేంద్ర ముదిరాజ్, సాయికిరణ్ ముదిరాజ్, రమణ, నజయ్ ముదిరాజ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు శంకర్, ఇతరులకు కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ని భారీ మెజారిటీతో గెలిపించుకుని, అంబర్ పేట గడ్డపై మరోసారి బీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తామని ఈ సందర్భంగా శంకర్ తెలియజేశారు. కాగా ఇప్పటికే అంబర్ పేట ముఖ్య బీజేపీ నాయకులు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
Also Read: Yoga: యోగా చేయడం వల్ల ఎన్ని ఆరోగ్య లాభాలున్నాయో తెలుసా