GT vs CSK: టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కు శుభారంభం దొరికింది. రుతురాజ్ గైక్వాడ్ మరియు డెవాన్ కాన్వాయ్ చక్కటి అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని పంచుకున్నారు. ఈ మ్యాచ్ ప్రారంభంలో రుతురాజ్ గైక్వాడ్‌కు లైఫ్‌లైన్ దొరికింది. దర్శన్ నల్కండే వేసిన బంతికి శుభమాన్ గిల్ క్యాచ్ పట్టడంతో ఆ బంతిని నో బాల్‌గా ప్రకటించాడు. దీంతో గుజరాత్ కు వికెట్ లభించకపోగా.. ఫ్రీ హిట్ ని గైక్వాడ్ అద్భుతంగ సద్వినియోగం చేసుకున్నాడు. ఫ్రీ హిట్ ని కాస్త హిట్ ట్రాక్ ఎక్కించి సిక్స్ కొట్టాడు. 9వ ఓవర్‌లో గైక్వాడ్ తన ఖాతాలో మరో అర్ధసెంచరీ నమోదు చేశాడు. అయితే 11వ ఓవర్లో మూడో బంతికి క్యాచ్ ఔట్ అయ్యాడు.
రుతురాజ్ గైక్వాడ్ 44 బంతుల్లో 60 పరుగులు చేసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. తర్వాత శివమ్ దూబే 1 పరుగు చేసి అవుటయ్యాడు. అదే సమయంలో 17 పరుగుల వద్ద అజింక్యా రహానే ఔటయ్యాడు. అనంతరం అంబటి రాయుడు బ్యాటింగ్‌కు వచ్చాడు. ఈ మ్యాచ్‌లో రాయుడు 8 పరుగులు చేసి తన ఖాతాలో రికార్డు నమోదు చేశాడు. 8 పరుగులు చేయడంతో టీ20లో 11 వేలకు పైగా పరుగులు చేసిన టీమిండియా 11వ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
T20 కెరీర్‌లో క్రిస్ గేల్ అత్యధిక పరుగులు సాధించాడు. గేల్ 14562 పరుగులు చేశాడు. టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు విరాట్ కోహ్లీ. కోహ్లీ 11965 పరుగులు చేశాడు.
Read More: GT vs CSK: చపాక్ స్టేడియంలో ‘ధోనీ’ నామస్మరణ