Site icon HashtagU Telugu

Ambati Rayudu IPL Retirement: ఐపీఎల్‌కు అంబటి రాయుడు గుడ్ బై … ఇక నో యూ టర్న్

Ambati Imresizer

Ambati Imresizer

Ambati Rayudu IPL Retirement: తెలుగు తేజం గుంటూరు కుర్రాడు అంబటి రాయుడు ఐపీఎల్‌కు ముగింపు పలికాడు. గత కొన్ని సీజన్లుగా చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌ తరుపున ఆడుతున్న అంబటి, ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్‌కు ముందు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగే టైటిల్ మ్యాచ్ తన ఐపీఎల్ కెరీర్‌లో చివరి మ్యాచ్ అని రాయుడు ట్వీట్ చేశాడు. 2010లో మొదటి సారిగా ఐపీఎల్ కెరీర్ ప్రారంభించిన అంబటి రాయుడు ముంబయి ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. తరువాత చెన్నై సూపర్ కింగ్స్ అంబటిని వేలంలో కొనుగోలు చేసింది. నిజానికి 2019 ప్రపంచకప్‌లో భారత జట్టులో తనకి చోటు దక్కకపోవడంతో రాయుడు తన రిటైర్మెంట్‌ను అప్పుడే ప్రకటించాడు. అయితే తరువాత జరిగిన పరిణామాల కారణంగా రాయుడు మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది.

నిజానికి 2019 టైంలో రాయుడు సూపర్ ఫామ్ లో కనిపించాడు. ప్రపంచకప్‌లో టీమిండియా తరఫున రాయుడు నాలుగో స్థానంలో ఆడతాడని అంతా భావించారు. అయితే సెలక్టర్లు చివరి క్షణంలో రాయుడిని పట్టించుకోకుండా విజయ్ శంకర్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఆ సమయంలో చీఫ్ సెలెక్టర్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఎంఎస్‌కే ప్రసాద్ విజయ్‌ను 3-డి ఆటగాడిగా అభివర్ణిస్తూ ప్రశంసలు కురిపించాడు. అయితే దానికి రాయుడు కౌంటర్ గా ట్వీట్ చేశాడు. “ప్రపంచ కప్ చూడటానికి ఇప్పుడే 3డి గ్లాసెస్ ఆర్డర్ చేసాను అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. దీంతో అప్పట్లో రాయుడు అనేక వివాదాల్లో చిక్కుకున్నాడు. విశేషం ఏంటంటే విజయ్ శంకర్ గాయపడినప్పటికీ భారత ప్రపంచకప్ జట్టులోకి తనను పిలవకపోవడంతో రాయుడు చాలా నిరాశకు గురయ్యాడు. విజయ్‌కి ప్రత్యామ్నాయంగా సెలెక్టర్లు మయాంక్ అగర్వాల్‌ను జట్టులోకి తీసుకున్నారు, ఆ తర్వాత రాయుడు అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుండి తన రిటైర్మెంట్‌ను ప్రకటించాడు.

అయితే 2019 ఆగస్టులో తన రిటైర్మెంట్ నిర్ణయంపై అంబటి రాయుడు యూ-టర్న్ తీసుకున్నాడు. ఆవేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్వీట్‌లో తెలిపారు. “కెనడా మరియు అనేక దేశాలలో ఆడేందుకు నాకు ఆఫర్స్ వస్తున్నాయని, అయితే నా దేశం కోసం T10 మరియు T20 క్రికెట్ ఆఫర్‌ను తిరస్కరించానని, అభిమానుల కోసం రిటైర్మెంట్ ని వెనక్కి తీసుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశాడు.

Read More: Shubman Gill: చెన్నై ముందున్న అతిపెద్ద సవాలు @శుభ్‌మన్