Site icon HashtagU Telugu

Ambani Family : గొప్ప మనసు చాటుకున్న ముకేశ్ అంబానీ ఫ్యామిలీ

Ambanis Organise Mass Weddi

Ambanis Organise Mass Weddi

పేదలకు ముఖేష్ అంబానీ(Ambani Family) దంపతులు ఘనంగా సామూహిక వివాహాలు జరిపించి తమ గొప్ప మనసు చాటుకున్నారు. రిలయన్స్ కార్పొరేట్ పార్క్ లో ఈ పెళ్లి వేడుకలు జరిపారు. ఈ సామూహిక వివాహానికి ముఖేశ్ అంబానీ, నీతా అంబానీ, ఆకాశ్, శ్లోక, ఈషా, ఆనంద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్త జంటలకు కానుకలు విలువైన కానుకలు అందించారు.

బంగారు మంగళసూత్రం, ఉంగరాలు, ముక్కు పుడకలు, మట్టెలు, పట్టీలు వంటివి అందించింది. అలాగే పెళ్లి కూతురికి స్త్రీ ధనం కింద రూ.1.01 లక్షల చెక్ అందించింది. వీటితో పాటు ఆ జంటలకు ఏడాదికి సరిపడా నిత్యావసర సరుకులు సైతం అందించడం గమనార్హం. పుట్టింటి వారు తన కూతురికి పెళ్లి సారె అందించినట్లుగానే గ్యాస్ స్టవ్, మిక్సీ, పరుపులు, దిండ్లు, ఫ్యాన్, వంట సామగ్రి వంటివి అందించారు. ఇక ఈ పెళ్లి వేడుకకు దాదాపు 800 మందికి పైగా హాజరయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

రాబోయే పెళ్లిళ్ల సీజన్‌లో దేశవ్యాప్తంగా ఇలాంటి వందలాది పెళ్లిళ్లకు తమ మద్దతును కొనసాగిస్తామని అంబానీ కుటుంబం ప్రతిజ్ఞ చేసింది. అంబానీ కుటుంబం ఈ సామూహిక వివాహాల ద్వారా సార్వత్రిక నైతిక విలువల నినాదమైన “మానవ్ సేవా హి మాధవ్ సేవ” – “మానవత్వానికి చేసే సేవే భగవంతుని సేవ”ను సమర్థిస్తుంది.అందులో భాగంగానే ఈ సామూహిక వివాహ కార్యక్రమాన్ని చేపట్టింది.

ఇక ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల పెళ్లి (Anant Ambani-Radhika Merchant wedding) జూలై 12న జరగనుంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ పెళ్లి వేడుకను నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ వెడ్డింగ్ కు సంబదించిన శుభలేఖ వైరల్ గా మారింది.

Read Also : UP Hathras Stampede : 107కు చేరిన మృతుల సంఖ్య