Amazon: అమెజాన్ షాక్.. పెద్ద నోట్లు స్వీకరించబడవు

ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ సెప్టెంబర్ 19 తర్వాత క్యాష్ ఆన్ డెలివరీపై రూ.2,000 నోట్లను స్వీకరించబోమని స్పష్టం చేసింది

Amazon: ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ సెప్టెంబర్ 19 తర్వాత క్యాష్ ఆన్ డెలివరీపై రూ.2,000 నోట్లను స్వీకరించబోమని స్పష్టం చేసింది. అమెజాన్ ప్రస్తుతం రూ.2,000 నోట్లను తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే సెప్టెంబర్ 19, 2023 నుండి క్యాష్ ఆన్ డెలివరీ (COD) చెల్లింపుల ద్వారా రూ.2,000 నోట్లను తీసుకోలేమని అమెజాన్ ప్రకటించింది.

2023 మే 19న రూ. 2000 నోట్లు రద్దు అయిన విషయం తెలిసిందే. దాంతో చాలా మంది ఖాతాదారులు తమ దగ్గరున్న రూ.2000 నోట్లను మార్చుకోవడానికి శ్రమించారు. కొన్ని ఎటిఎం లు పెద్ద నోట్లను తీసుకోకపోవడం, అనేక మంది బ్యాంకులకు వెళ్లి డిపాజిట్ చేయాల్సి వచ్చింది. మరికొందరు తమకు కావాల్సిన వస్తువులను ఆన్ లైన్ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్, మరియు ఇతర సంస్థల ద్వారా కొనుగోలు చేయి క్యాష్ అండ్ డెలివరీ ద్వారా 2000 నోట్లను మార్చుకున్నారు. కాగా ప్రస్తుతం అమెజాన్ కూడా పెద్ద నోట్లను తీసుకోమని తెలిపింది. దీంతో పెద్ద నోట్లును మార్చాలంటే నేరుగా బ్యాంకుల్లోనే సాధ్యం.

ఇదిలా ఉండగా రూ.2000 నోట్లను 2023 సెప్టెంబర్ 20లోగా సమీపంలోని బ్యాంకు శాఖల్లో మార్చుకోవాలని ఆర్‌బీఐ సూచించింది. అంతకు మించి గడువు పొడిగిస్తారో లేదో చూడాలి.

Also Read: TDP- Janasena Alliance : టీడీపీ – జనసేన పార్టీలు పొత్తు ఖరారు చేసిన పవన్ కళ్యాణ్