Site icon HashtagU Telugu

Pushpa: థియేటర్స్‌లో రన్ అవుతుండగా.. ఓటీటీ రిలీజ్

Template (14) Copy

Template (14) Copy

అల్లు అర్జున్ ప్రధానపాత్రలో సుకుమార్ దర్శకత్వం వహించిన చిత్రం ‘పుష్ప’ డిసెంబర్ 17న విడుదలైన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. వరల్డ్ వైడ్‌గా పుష్ఫ చిత్రం ఇప్పటికి రూ. 306 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. థియేటర్స్‌లో ఇంకా రన్ అవుతున్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. జనవరి 7న ‘పుష్ప’ చిత్రం హిందీ తప్ప అన్ని దక్షిణాది భాషల్లోనూ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతోందని అమెజాన్ ప్రైమ్ ట్విట్టర్ అక్పౌంట్ లో అఫీషియల్ గా ప్రకటించారు.