Allu Arjun: సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను నేడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పరామర్శించనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడికాలేదు. ఒకవేళ ఆస్పత్రికి వెళ్లదల్చుకుంటే ఒకరోజు ముందే తమకు చెప్పాలని చిక్కడపల్లి పోలీసులు ఐకాన్ స్టార్‌కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే బెయిల్ మీద ఉన్న అల్లు అర్జున్ పోలీస్ నియమ నిబంధనలు పాటించాలని అంటున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు కిమ్స్ ఆస్పత్రి వద్దకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
తొక్కిసలాట ఘటనలో బన్నీ అరెస్ట్
ఇకపోతే డిసెంబర్ 4వ తేదీన పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌కు వెళ్లిన అల్లు అర్జున్‌కు తొలిసారి షాక్ తగిలింది. ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో అక్కడ ఒక మహిళ మృతిచెందింది. అంతేకాకుండా ఆమె కుమారుడు శ్రీతేజ్ సైతం తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్ అని పోలీసులు ఆరోపించారు. అంతేకాకుండా బన్నీపై కేసు నమోదు చేసి ఏ11గా పేర్కొన్నారు. అనంతరం బన్నీని అరెస్ట్ చేసిన పోలీసులు చట్టప్రకారం నాంపల్లి క్రిమినల్ కోర్టులో హాజరుపర్చారు. క్రిమినల్ కోర్టు అతనికి 14 రోజులపాటు రిమాండ్ విధించింది. అయితే హైకోర్టు అదేరోజు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో బన్నీ ఒక రోజు జైలులో ఉండి మరుసటి రోజు ఉదయం విడుదలయ్యాడు.
Also Read: Tremors In India : నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో భారీ భూకంపం.. బిహార్, ఢిల్లీ, బెంగాల్‌లో ప్రకంపనలు
కలెక్షన్ల పరంగా దూసుకెళ్తున్న పుష్ప-2
ఇకపోతే సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటించిన పుష్ప-1 కొనసాగింపుగా వచ్చిన మూవీ పుష్ప-2. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 5న ఘనంగా విడుదలైంది. అయితే ఈ మూవీ రిలీజ్ రోజు నుంచే కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులను సృష్టిస్తుంది. సినిమా విడుదల నుంచి జనవరి 6 వరకు పుష్ప-2 మూవీ ఏకంగా రూ. 1831 కోట్లు సాధించిన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఓ కొత్త రికార్డును సృష్టించింది. ఈ మూవీ జోష్ మీద ఉన్న అల్లు అర్జున్ తన తదుపరి సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో రానుంది.