Site icon HashtagU Telugu

Allu Arjun Hollywood Movie: దటీజ్ ఐకాన్ స్టార్.. హాలీవుడ్ లోకి అల్లు అర్జున్!

Allu Arjun

Allu Arjun

‘పుష్ప: ది రైజ్’లో అద్భుత నటనతో ఆకట్టుకున్న అల్లు అర్జున్ అటు టాలీవుడ్, ఇటు బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఒక్క సినిమాతోనే ప్యాన్ ఇండియ హీరోగా మారాడు. తెలుగు చిత్రపరిశ్రమలో ఇప్పటికే స్టార్ డం సొంతం చేసుకున్న ఈ ఐకాన్ స్టార్.. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత డిమాండ్ ఉన్న నటుడిగా మారుతున్నాడు. నిజానికి, ఇటీవల, అల్లు అర్జున్ న్యూయార్క్‌లో ఇండియన్ డే పరేడ్‌లో భారతదేశానికి గ్రాండ్ మార్షల్‌గా ప్రాతినిధ్యం వహించి భారతదేశాన్ని గర్వించేలా చేసిన విషయం తెలిసిందే.

అల్లు అర్జున్‌కి దక్కిన గొప్ప గౌరవంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే అల్లు అర్జున్ తన అభిమానులకు మరో శుభవార్త అందించబోతున్నాడు. బన్నీ త్వరలో తన హాలీవుడ్ అరంగేట్రం చేయబోతున్నట్లు తెలుస్తోంది. అవును.. మీరు చదివింది నిజమే! “అల్లు అర్జున్‌కి దర్శక-నిర్మాత హాలీవుడ్ చిత్రాన్ని ఆఫర్ చేశారు. న్యూయార్క్‌లో ఉన్నప్పుడు అందుకు సంబంధించిన డిస్కషన్స్ నడిచాయట. అయితే హాలీవుడ్ సినిమాపై ఆఫిషియల్ గా బన్నీ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఈ వార్త నిజమైతే నిజంగా అల్లు అర్జున్ అభిమానులు పండుగ చేసుకున్నట్టే మరి!