Sandya 70 MM: పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో చూసేందకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంధ్య 70ఎంఎం థియేటర్ రావడం.. అక్కడ అభిమానులత తోపులాటలో రేవతి అనే మహిళ మృతి, ఆమె కొడుకు శ్రేతేజ్ ఆసుపత్రిలో చేరడం సంచలన రేపింది. అయితే.. ఈ కేసులో పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసి కోర్టు తరలించడంతో నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ కూడా విధించింది. అయితే.. హైకోర్టులో అల్లు అర్జున్ తరుఫున క్వాష్ పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే.. ఈ వాదనల సమయంలో.. అల్లు అర్జున్ తరుఫున లాయర్.. సినిమాకు అల్లు అర్జున్ వస్తున్నారని బందోబస్తు ఇవ్వాలని ముందే తెలిపినట్లు వెల్లడించారు.
Cyclone Chido : చిడో తుఫాను బీభత్సం.. ఫ్రాన్స్‌లో వేలాది మంది మృతి
అయితే.. ఈనేపథ్యంలో తాజాగా పోలీసు వారు కీలక విషయాలను ప్రకటించారు. పుష్ప -2 ప్రీమియర్ షో కు హీరో, హీరోయిన్స్ చిత్ర యూనిట్ వస్తున్నట్లు థియేటర్ యాజమాన్యం పోలీసుల అనుమతి కోరిన మాట వాస్తవమే అని.. కాకపోతే.. హీరో, హీరోయిన్స్ స్పెషల్ షో కు రావడంతో క్రౌడ్ విపరీతంగా ఉంటుందని థియేటర్ యాజమాన్యంకు సూచించిన పోలీసులు.. వారు రావొద్దని థియేటర్ యాజమాన్యం కు సమాచారం ఇచ్చారు. వ్రాత పూర్వకంగా చిక్కడపల్లి పోలీసులు సమాచారం ఇచ్చినట్లు సంబంధిత పేపర్‌ను మీడియాకు విడుదల చేశారు. అయినా పోలీసుల మాట వినకుండా వచ్చిన హీరో రావడంమే కాకుండా అనుమతి లేకుండా ర్యాలీ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
హీరో రావడంతో ఒక్కసారి థియేటర్ లోకి అభిమానులు దూసుకెళ్లడంతో.. జనం మధ్యంలో రేవతి అనే మహిళ స్పృహ కోల్పోయిందని, వెంటనే రేవతికి వారి బాబు శ్రీ తేజ్ కు చిక్కడపల్లి పోలీసులు PCR చేశారన్నారు. అనంతరం స్థానిక హాస్పిటల్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. అయితే.. హాస్పిటల్‌లో రేవతి మృతి చెందినట్లు, రేవతి మృతి విన్న తర్వాత అల్లు అర్జున్‌ను పోలీసులు బయటకు పంపించినట్లు తెలిపారు. మళ్ళీ వెళ్లే సమయంలో కార్ ఎక్కి ర్యాలీ ద్వారా అల్లు అర్జున్ అభిమానులకు అభివాదం తెలిపినట్లు.. అల్లు అర్జున్ రిమాండ్ వాదనల సమయం ఇదే అంశాన్ని కోర్టుకు పిపి తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో అల్లు అర్జున్‌కు నాంపల్లి 9 th మెట్రో పాలిటన్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు తెలిపారు.
Madhya Pradesh: మన మధ్యప్రదేశ్ పర్యాటక వైవిధ్యంతో గొప్పది: ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్