Site icon HashtagU Telugu

Allu Arjun: పునీత్ కు బన్నీ నివాళి!

Allu Arjun

Allu Arjun

కన్నడ సూపర్ పునీత్ రాజ్ కుమార్ తుదిశ్వాస విడిచి నెలలు గడుస్తున్నా.. ఆయన మెమోరీస్ నుంచి జనాలు బయటపడలేకపోతున్నారు. సినీ ప్రేక్షుకుల మొదలుకొని హీరోలు, ప్రముఖులు, రాజకీయ నాయకులు తరచుగా పునీత్ ను స్మరించుకుంటున్నారు. తాజాగా సినీనటుడు అల్లుఅర్జున్‌ బెంగళూరులోని పునీత్‌ రాజ్‌కుమార్‌ నివాసానికి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం రాజ్‌కుమార్‌ చిత్రపటానికి నివాళి అర్పించారు. కాగా కన్నడ సినిమా పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ 46 ఏళ్ల వయసులో అక్టోబర్ 29న గుండెపోటుతో కన్నుమూశారు. పునీత్ రాజ్‌కుమార్ గౌరవార్థం అతని ప్రొడక్షన్ హౌస్ నుంచి మూడు సినిమాలు OTT ప్లాట్‌ఫారమ్‌లో విడుదల చేయడానికి అమెజాన్ ప్రైమ్ సిద్ధమవుతోంది.