CM Revanth: జాతీయ రహదారుల విస్తరణకు నిధులు కేటాయించండి, కేంద్రానికి రేవంత్ రిక్వెస్ట్

  • Written By:
  • Publish Date - February 20, 2024 / 11:01 PM IST

CM Revanth: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులు అభివృద్ధి, రాష్ట్రీయ రహదారులను జాతీయ రహదారులుగా గుర్తింపు సహా పలు కీలక అంశాలపై చర్చ జరిపారు.

తెలంగాణ లోని 15 రాష్ట్రీయ రహదారులను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలని విజ్ఞప్తి చేసారు. హైదరాబాద్ శ్రీశైలం ఫోర్ లైన్ ఎలివేటెడ్ కారిడార్, హైదరాబాదు కల్వకుర్తి రహదారి నీ నాలుగు వరుసల గా అభివృద్ధి చేయడం, రీజినల్ రింగ్ రోడ్డు (RRR)దక్షిణ భాగం అభివృద్ధి, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని ఆరువరుసల విస్తరించడం పై గడ్కరీ తో రేవంత్ రెడ్డి , మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చర్చ జరిపారు. సీఆర్ఐఎఫ్ నుండి తెలంగాణ కు నిధుల కేటాయింపు పెంచాలనీ విజ్ఞప్తి చేసారు. నల్గొండలో ట్రాన్స్పోర్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని,నల్గొండ పట్టణానికి బైపాస్ రోడ్డు మంజూరు చేయాలని నితిన్ గడ్కరీ కి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక విజ్ఞప్తి చేసారు.

ఢిల్లీ టూర్ లో ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ తో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలు భేటీ అవుతారని సమాచారం. లోక్ సభ అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్ పదవుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ అంశాలపై వారితో చర్చించనున్నారు. అదేవిధంగా కొత్తగా పార్టీలో చేరుతున్న వారికి పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ హామీలపై హైకమాండ్ తో చర్చించే అవకాశం ఉంది.