అల్లరి నరేశ్ అనగానే కామెడీ సినిమాలతో పాటు డిఫరెంట్ సినిమాలు గుర్తుకువస్తాయి. మరోసారి ఈ హీరో కొత్త కథతో రాబోతున్నాడు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా మరియు బాలాజీ గుత్తా నిర్మించనున్నారు. మేకర్స్ #N63 టైటిల్‌ను ప్రకటించారు. దీనికి బచ్చల మల్లి అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. టైటిల్ పోస్టర్‌లో పూర్తిగా లోడ్ చేయబడిన ట్రాక్టర్ లోయలో పడిపోతున్నట్లు కనిపిస్తోంది.
ట్రాక్టర్‌పై టైటిల్ రాసి ఉంది. ఇక టైటిల్ పోస్టర్ ద్వారా సినిమాలో యాక్షన్ డోస్ ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ వీడియో ద్వారా ఇది కొత్త తరహా యాక్షన్ డ్రామాగా రూపొందించబడినట్లు తెలుస్తోంది. ఇందులో అల్లరి నరేష్ ఇంటెన్సివ్ రోల్ ప్లే చేయబోతున్నాడట.