Minister Roja: వైసీపీ గెలుపే లక్ష్యంగా ఏపీ మంత్రి రోజా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఏపీలోని పుత్తూరు రురల్ మండలంలో తిరుమలకుప్పం, కృష్ణసముద్రం, అక్కేరి, వేపగుంట, నందిమంగళం,నెత్తం, కె,బి,ఆర్ పురం లో పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ పరిపాలన, నగరి నియోజకవర్గంలోని ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధిపై చూపిస్తున్న ఆదరాభిమానాలను చూసి మంత్రి రోజా నాయకత్వంలో పనిచేయుటకు వైసీపీలో చేరినట్లు వారు తెలిపారు.
ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ… టీడీపీ అధికారంలోకి వస్తే ఇంగ్లీష్ మీడియం విద్య ఉండదని, నాడు నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి జరగదని, కార్పోరేట్ స్కూల్ పిల్లల మాదిరి ఇచ్చే విద్యా కానుక ఉండదని అన్నారు. మంత్రి రోజా వెంట ప్రజా ప్రతినిధులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.