Site icon HashtagU Telugu

Rahul Shedule: ‘రాహుల్ టూర్’ షెడ్యూల్ ఇదే!

Rahul Gandhi

Rahul Gandhi

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ మేరకు టీకాంగ్రెస్ నేతలు ఓరుగల్లు సభ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సీనియర్ నేతలు ఇప్పటికే వరంగల్ కు చేరుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రాహుల్ రాక నేపథ్యంలో ఓరుగల్లు మొత్తం కాంగ్రెస్ జెండాలతో రెపరెపలాడుతోంది. తెలంగాణలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ మినిట్ టు మినిట్ షెడ్యూల్ ఇదే..

ఇవాళ సాయంత్రం 4:50కి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఏయిర్పోట్ చేరుకోనున్న రాహుల్ గాంధీ..

5:10కి శంషాబాద్ ఏయిర్పోట్ నుంచి హెలికాప్టర్ ద్వారా వరంగల్ బయలుదేరుతారు..

5:45కు వరంగల్ గాబ్రియెల్ స్కూల్ కు చేరుకుంటారు..

6:05 వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో పాల్గొంటారు..

8 గంటలకు వరంగల్ నుండి బై రోడ్ ద్వారా బయలుదేరి రాత్రి 10:40 హైదరాబాద్ చేరుకుంటారు..

రాత్రి బంజారాహిల్స్ తాజ్ కృష్ణ హోటల్ లో స్టే చేస్తారు..

ఆ మరుసటి రోజు మధ్యాహ్నం 12:30కి హోటల్ తాజ్ కృష్ణ నుంచి బయలుదేరి 12:50కి సంజీవయ్య పార్కు కు చేరుకుంటారు..

12:50-1:10మధ్య దివంగత మాజీ సీఎం సంజీవయ్య కు నివాళులు అర్పిస్తారు..

1:15 కు సంజీవయ్య పార్కు నుంచి బయలుదేరి 1:30కి గాంధీ భవన్ చేరుకుంటారు..

1:45నుంచి 2:45వరకు గాంధీ భవన్ లో పార్టీ extended మీటింగ్ లో పాల్గొంటారు.

1:45నుంచి 2:50వరకు మెంబర్ షిప్ కో ఆర్డినేతలతో ఫోటోలు దిగుతారు..

3 గంటలకు గాంధీ భవన్ నుంచి బైరోడ్ ద్వారా ఏయిర్పోట్ చేరుకుంటారు..

5:50కి శంషాబాద్ ఏయిర్పోట్ నుంచి ఢిల్లీ వెళ్తారు.

Exit mobile version