Site icon HashtagU Telugu

New Tata Avinya: 30 నిమిషాల్లోనే ఛార్జింగ్‌, 500 కి.మీ మైలేజీ

The Tata Avinya Concept Car

The Tata Avinya Concept Car

టాటా మోటార్స్‌ సరికొత్త ఎలక్ట్రిక్‌ కారు విడుదల కానుంది. దాని పేరు  ‘అవిన్యా’ (Avinya).ఇది ఒక SUV . 30 నిమిషాల్లోనే ఫుల్‌ చార్జింగ్‌ అవుతుంది. 30 నిమిషాల ఛార్జింగ్‌కి కనీసం 500 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ‘అవిన్యా’ ను 2025 నాటికి మార్కెట్లోకి తీసుకొస్తామని టాటా మోటార్స్ ప్రకటించింది. ఈ ఎలక్ట్రిక్‌ కారును భారతదేశ రోడ్లు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తయారు చేస్తున్నట్లు టాటా మోటార్స్‌ తెలిపింది. అవిన్యా విషయానికొస్తే..SUV, MPV కలబోతగా.. BMW, Tesla కార్లకు ధీటుగా ఉంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. 4300mm పొడవుతో..సువిశాలమైన క్యాబిన్, లగ్జరీ సీట్లు, ఎక్కిదిగడానికి వీలుగా తెరుచుకునే డోర్లు..ముందు భాగంలో డిజైనర్ LED లైట్లు..ఇలా ఎన్నో ప్రత్యేకతలు అవిన్యా ఎలక్ట్రిక్ కారులో ఉన్నాయి.