Bank Strike: బ్యాంకులో పనులు ఉన్నాయా.. అయితే ఈ విషయం తెలుసుకోండి ఆరోజు స్ట్రైక్?

ఈ వారంలో ఏదైనా ముఖ్యమైన బ్యాంకు లావాదేవీలు ఉంటే వెంటనే వాటిని పూర్తి చేసుకోండి. ఎందుకంటే ఈ వారం

  • Written By:
  • Publish Date - November 17, 2022 / 05:15 PM IST

ఈ వారంలో ఏదైనా ముఖ్యమైన బ్యాంకు లావాదేవీలు ఉంటే వెంటనే వాటిని పూర్తి చేసుకోండి. ఎందుకంటే ఈ వారం అనగా నవంబర్ 19న ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఒకరోజు సమ్మెను ప్రకటించింది. దీంతో బ్యాంకు ఉద్యోగులు నవంబర్ 19వ తేదీన సమ్మెకు దిగబోతున్నాయి. ఈ సమ్మె కారణంగా బ్యాంకింగ్ ఏటీఎం సేవలపై అంతరాయం ఏర్పడునుంది. కాగా ఈ సమ్మెలో దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించిన ఉద్యోగులు పాల్గొంటున్నారు. కాగా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నవంబర్ 19న సమ్మెకు దిగబోతున్నట్లు ఇప్పటికే నోటీసును ఇచ్చిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ మేనేజ్మెంట్స్ సమావేశాలు కూడా జరిగాయి. ఈ సమావేశంలో చర్చలు సఫలం కానందున వారు నవంబర్ 19న సమ్మె చేస్తాము అని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ స్పష్టం చేసింది. నవంబర్ 19 అనగా మూడవ శనివారం. అయితే ఆ రోజున బ్యాంకులు తెరిచే ఉన్నప్పటికీ బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా బ్యాంకింగ్ కార్యకలాపాలకు అదేవిధంగా ఏటీఎం సేవలకు అంతరాయం కలగక తప్పదు.

మరుసటి రోజు అనగా ఆదివారం ఆరోజున బ్యాంకులు తెరచుకోవు కాబట్టి వరుసగా రెండు రోజులు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవు. ఆ తర్వాత మళ్లీ నవంబర్ 21 నుంచి బ్యాంకు సేవలు యథావిధిగా పనిచేస్తాయి. ఇకపోతే ట్రేడ్ యూనియన్ ల పై దాడులు పెరుగుతుండడంతో పాటుగా ఉద్యోగుల హక్కులు ఉద్యోగ భద్రతపై భంగం కలుగుతోందని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆరోపిస్తోంది. ద్వైపాక్షిక సెటిల్ మెంట్ I.D. చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని, సెటిల్మెంట్లను ఉల్లంఘించి బదిలీల ద్వారా ఉద్యోగులపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తోంది. ఇటువంటి వేధింపులను ఆపాలి అన్నది బ్యాంకు ఉద్యోగుల యొక్క ప్రధాన డిమాండ్.