Site icon HashtagU Telugu

By Poll – 6 States : 7 బైపోల్స్ కౌంటింగ్ షురూ.. ఏ స్థానంలో ఏ పార్టీ ఆధిక్యంలో ఉందంటే.. ?

By Poll 6 States

By Poll 6 States

By Poll – 6 States : ఆరు రాష్ట్రాల్లోని  ఏడు అసెంబ్లీ స్థానాలకు ఇటీవల జరిగిన   బై పోల్స్ కు సంబంధించిన కౌంటింగ్ ఉదయం 8 గంటలకు మొదలైంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘోసి, పశ్చిమ బెంగాల్‌లోని ధూప్‌గురి, కేరళలోని పుతుపల్లి, ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్, జార్ఖండ్‌లోని డుమ్రీ, త్రిపురలోని బాక్సానగర్, ధన్‌పూర్‌లలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఈ ఏడు అసెంబ్లీ స్థానాల్లో 3 (ధన్‌పూర్ , బాగేశ్వర్, ధూప్‌గురి) చోట్ల గతంలో బీజేపీ గెలిచింది.  ఇక ఇంతకుముందు ఎలక్షన్స్ లో ఘోసి స్థానం నుంచి  సమాజ్ వాదీ  పార్టీ,  బాక్సా నగర్ స్థానం నుంచి సీపీఎం, డుమ్రీ స్థానం నుంచి జార్ఖండ్ ముక్తి మోర్చా,  పుతుపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ గెలిచాయి. కొందరు ఎమ్మెల్యేల మరణం, ఇంకొందరు ఎమ్మెల్యేల రాజీనామాతో ఈ ఏడుచోట్ల బైపోల్స్ జరిగాయి. అయిత ఈసారి ఫలితం ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ సారథ్యంలో ఇండియా కూటమి ఆవిర్భవించిన తర్వాత జరిగిన తొలి ఎన్నిక ఇదే. దాదాపు మూడు చోట్ల ఇండియా కూటమి తరఫున ఒకే అభ్యర్థి బరిలో ఉన్నాడు. మిగతా చోట్ల త్రిముఖ పోటీ ఉంది. బీజేపీని ఇండియా కూటమి ఎంతమేర నిలువరించగలదు అనే దానికి ఈ బైపోల్ ఫలితాలు ఇక లిట్మస్ టెస్ట్ లా ఉంటాయని రాజకీయ పరిశీలకులు (By Poll – 6 States) అభిప్రాయపడుతున్నారు.

Also read : DGT Hacked : భారత ప్రభుత్వ వెబ్ సైట్ హ్యాక్.. ఇండోనేషియా హ్యాకర్ల బరితెగింపు !

బై పోల్ కౌంటింగ్ తాజా అప్ డేట్ (ఉదయం 10.42 గంటల సమయానికి)

  • పుతుపల్లి స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి చాందీ ఊమెన్ 7,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
  • బాక్సానగర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి తఫజ్జల్ హుస్సేన్ ముందంజలో ఉన్నారు.
  • ఘోసి స్థానంలో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో బీజేపీకి చెందిన దారా సింగ్ చౌహాన్ ముందంజలో ఉన్నారు.
Exit mobile version