Site icon HashtagU Telugu

IIT Hyderabad:విద్యాసంస్థల్లో పెరుగుతున్న కరోనా కేసులు

Iit Hyderabad Imresizer

Iit Hyderabad Imresizer

కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. ముఖ్యంగా విద్యాసంస్థల్లో మాస్ గ్యాదరింగ్ అయ్యే కారణంగా పలు రాష్ట్రాల్లోని విద్యాసంస్థల్లో ఒకేసారి వందలాది కేసులు బయటపడుతున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లాలోని కందిలోని ఐఐఐటీ లో 120మందికి కరోనా తేలింది. కరోనా సోకినవారిలో 107 మంది విద్యార్థులు కాగా, మిగతావారు బోధన బోధనేతర సిబ్బంది కూడా ఉన్నట్లు సమాచారం.

ఐఐఐటీ హైదరాబాద్ లో అందరికీ వాక్సినేషన్ ఇప్పించామని, కరోనా సోకిన వాళ్ళు కూడా కోలుకుంటున్నారని అధికారులు తెలిపారు. కరోనా సోకినవారిని హాస్టల్ లో ఉంచి మెరుగైన వైద్యం అందిస్తున్నామని అధికారులు తెలిపారు. క్యాంపస్ లో మరిన్ని కేసులు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని వైద్య శాఖ అధికారులు భావిస్తున్నారు.

గతంలో కూడా తెలంగాణలోని పలు విద్యాసంస్థల్లో ఇలాగే మాస్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని విద్యాసంస్థల్లో కూడా ఇలాగే ఒకేసారి వందలాది కేసులు తేలాయి. పిల్లల్లో ఒకేసారి కేసులు నమోదవడంతో తల్లితండ్రులు, అధికారులు ఆందోళన చెందుతున్నారు. అయితే కరోనా కేసులు జనవరి చివరివరకు మరిన్ని పెరుగుతాయని ఫిబ్రవరి చివరివరకు కరోనా తీవ్రత పూర్తిగా తగ్గే అవకాశముందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పిల్లల విషయంలో తల్లితండ్రులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.