Site icon HashtagU Telugu

Karnataka CM: మొదటి కాబినెట్ సమావేశంలో చట్టంగా మారనున్న 5 హామీలు

Karnataka CM

New Web Story Copy 2023 05 20t145905.666

Karnataka CM: కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ కూడా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. సిద్ధరామయ్య మరియు శివకుమార్‌లతో పాటు మంత్రులుగా ప్రమాణం చేసిన ప్రముఖ నాయకులలో జి పరమేశ్వర, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు, లింగాయత్ నాయకుడు ఎంబి పాటిల్ ఉన్నారు. దీంతో పాటు కేజే జార్జ్, కేహెచ్ మునియప్ప, సతీష్ జార్కిహోళి, జమీర్ అహ్మద్ ఖాన్, రామలింగా రెడ్డి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ కార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

కర్ణాకట ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన ప్రకటన ఆసక్తిగా మారింది. కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తొలి కేబినెట్ సమావేశంలో రెండు గంటల్లోగా మొత్తం 5 ‘హామీలు’ చట్టంగా మారుతాయని ఆయన చెప్పారు. దీంతో ఆ హామీలు, చట్టాలు ఏంటనేది ఆసక్తిగా మారింది.

కాగా..కర్ణాటక ప్రజలకు సీఎం సిద్దరామయ్య, డీకే శివకుమార్ ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపారు. నా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం అభివృద్ధి మరియు అందరి సంక్షేమానికి హామీ ఇస్తుందని పేర్కొన్నారు.

Read More: Cbi Vs Mamata : మమతా బెనర్జీ మేనల్లుడిని ప్రశ్నించిన సీబీఐ