Alia Bhatt: ముంబై ఎయిర్ పోర్టులో అలియా సందడి..!!

బాలీవుడ్ స్టార్ నటులు అలియా భట్, రణబీర్ కపూర్...వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత అలియా మొదటిసారిగా ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చింది.

Published By: HashtagU Telugu Desk
Alia Resumes Work Imresizer

Alia Resumes Work Imresizer

బాలీవుడ్ స్టార్ నటులు అలియా భట్, రణబీర్ కపూర్…వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత అలియా మొదటిసారిగా ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చింది. ఐదేళ్లపాటు డేటింగ్ చేసి ఏప్రిల్ 14న ముంబైలో పెళ్లి చేసుకుందీ జంట. పెళ్లికి కొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లి తర్వాత అలియా ఇవాళ ముంబైలోని కలీనా ఎయిర్ పోర్టులో కనిపించింది. రణబీర్ తో వివాహం తర్వాత ఈరోజే దర్శనమిచ్చింది. పెళ్లి తర్వాత పబ్లిక్ గా కనిపించడం ఇదే మొదటిసారి. అలియా కనిపించడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలయ్యారు.

పింక్ డ్రెస్సులో డింపుల్ బ్యూటీ చాలా అందంగా కనిపిస్తోంది. తన హ్యాండ్ బ్యాగ్, మినిమల్ జ్యూవెల్లరితో ఈ కొత్త పెళ్లి కూతురు మరింత అందంగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా అలియా ఎయిర్ పోర్టులో ముసి ముసి నవ్వులతో కెమెరాలకు హాయ్ చెప్పింది. పెళ్లి కార్యక్రమాలన్నీ కూడా ముగియడంతో రణబీర్ తన వర్క్ ను ప్రారంభించాడు. తాజాగా ఇవాళ అలియా బ్యాట్ టు వర్క్ చెప్పింది. ఇందులో భాగంగానే ముంబైలోని కలీనా ఎయిర్ పోర్టుకు వెళ్లింది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ తో కలిసి కరణ్ జోహార్ రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని మూవీలో అలియా నటిస్తోంది.

  Last Updated: 19 Apr 2022, 04:48 PM IST